3, ఆగస్టు 2012, శుక్రవారం

భైరవకొన.



ఒక రోజు మా స్నేహితుడు రమణ కందుకూరు నుంచి ఫోన్ చేసి భైరవకోన వెళదాం అక్కడ త్రిముఖ దుర్గాదేవిని  దర్శిస్తే చాలా మంచిదనీ రాత్రికి అక్కడే నిద్ర చేస్తె రాత్రిళ్ళు అమ్మవారు తిరుగుతున్నట్లుగా గజ్జెల శభ్దం వినిపిస్తుందని చెప్పాడు.అదంతా కొండలూ,కోనలతో నిండివుండి జనసమర్థం తక్కువగా ఉండే ప్రదేశం.




అయినా ఆ వింతని చూడాలని సరే అన్నాను.మరునాడు నేను నా బైక్ మీద మద్యాహ్నం 3 గం.లకు కందుకూరు వెళ్ళాను.అక్కడ రమణని పికప్ చేసుకొని పామూరు వైపెళ్ళే రోడ్డెక్కాము. దారిలో చెట్లూ,చేమలూ ప్రక్రుతి దౄశ్యాలను ఆస్వాదిస్తూ రాత్రి 8గం.లకు భైరవకోన చేరాము.


                               కాలబైరవుడు కన్నెర్ర చేయును
ఆరోజే ఎవరిదో పూజా కార్యక్రమం వున్నట్లుంది మేము వెళ్ళేసరికి పూజ జరుగుతుంది.వాళ్ళు మమ్మళ్ని రమ్మన్నరు,మేము అమ్మవారి అనుగ్రహంగా భావించి ఆ కార్యక్రమంలో పాల్గొన్నము.పూజ పూర్తయ్యెసరికి దాదాపు 9 గం.అయ్యింది.వళ్ళంతా వెళ్ళగానే మేము కొంతసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నము.అప్పటికే మెళ్ళగా గజ్జెల శబ్దం వినిపించసాగింది.నేను చుట్టూ బాగా పరిశీలించి చూశాను.




అక్కడ ఎవ్వరూ లేరు,క్రమక్రమంగా ఆ శబ్దం అన్నివైపులనించి వినబడసాగింది.నేను అన్నిరకాలుగా పరిశేలించి చూశాను శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని(కొన్ని రకాల పురుగులు కూడా అలాంటి శబ్దం చెయ్యొచ్చు లేదా స్పీకర్లు ఏమైనా వున్నాయా అనుకుని)కానీ మాకు ఎలాంటి ఆదారాలు దొరకలేదు.నేనూ ఏదీ సామాన్యంగా నమ్మను కాబట్టి మీకా సందేహం అవసరం లేదు.



మేము ఈ కాలంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా అనుకున్నాము.రాత్రంతా ఆ జగజ్జనని తోడుండగా హాయిగా నిద్రపోయాము.ఉదయం 5 గం.లకు నాకు మెలకువ వచ్చింది.వీడియో కెమేరాతో అంతా షూట్ చేయటం మొదలెట్టను.రమణ లేచాక ఇద్దరం కలసి స్నానం చేయటానికి జలపాతం వద్దకు వెళ్ళాము.




అది అంతపెద్ద జలపాతం కాకపొయినా ఎంతో అందంగా ఉంది.ఆ నీళ్ళన్ని కిందవున్న స్విమ్మింగ్ పూల్లలాంటి తొట్లలో పడేలా ఏర్పాటు చేసారు.మేము పైకెక్కి పైనవున్న శివలింగం వద్దకు చేరాము.రమణ నన్ను మంత్రాలు చదవమని చెప్పి ఆ నీళ్ళతో ఆ లింగానికి అభిషేకం చేయటం ప్రారంభించాడు. తరువాత చాలాసేపు కిందవున్న తొట్లలో  ఈత కొడుతూ బాగా ఎంజాయ్ చేసాము.


                                      భైరవకోన గుహాలయం
రెడీ అయ్యాక(బట్టలతోపాటు మేకప్ సామాను కూడా ఎప్పుడూ నా బ్యాగులో వుంటాయిలెండి)తిరిగి గుడికి బయలుదేరాము.దారిలో కొందరు సన్యాసులు చెట్లక్రింద కూర్చుని దీక్షగా ఏవో పనులు చేసుకుంటున్నారు.అంతావదిలేసి తనది అన్నది లేకుండా,కోరికలన్నిటినీ త్యజిస్తే అంతకన్నా ఆనందకరమైన జీవితం మరోకటి ఉండదు.


                                        శ్రీ త్రిముఖదుర్గాదేవి
మనిషికి ఎంతవున్న ఇంకా కావాలనిపిస్తొంది,ఇదే దుఖ్ఖానికి కారణం అనుకుంటూ కొంతదూరం వచ్చాక ఒక పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం కనిపించింది.ఆయనకు నమస్కరించుకుని గుడికి చేరుకున్నాము.అప్పటికే పూజాకార్యక్రమాలు ప్రారంబమయ్యాయి.అక్కడి పూజారులని పరిచయం చేసుకుని అర్చన చేయించుకున్నాము.


                               శేషమహాముని,శివరామబ్రహ్మం
త్రిముఖ దుర్గాదేవిని తనివితీరా దర్శించుకుని దగ్గరలోనే ఉన్న శేషమహాముని,శివరామబ్రహ్మం  గార్లని దర్శించుకుని పక్కనే గ్రుహలో వున్న  అన్నపూర్ణాదేవిని.గంగాదేవిని దర్శించుకున్నాము.


                                          గంగమ్మతల్లి గ్రుహ
మద్యాహ్నం 2 గం.లకు జలపాతానికి పోయెదారిలో వున్న ఒక హోటల్లో టిఫిన్ చేసి,నిదానంగా 3 గం.లకు తిరుగు ప్రయాణమయ్యాము.    

1 కామెంట్‌:

  1. sir

    excellent blog on temples on andhra pradesh. sir please explore my blogs and share your comments.

    http://indian-spiritual-heritage.blogspot.in/

    sir shall i use the photos and texts on several temples in my spiritual heritage blog.

    also please explore my other blogs.

    warm regards

    రిప్లయితొలగించండి