3, ఆగస్టు 2012, శుక్రవారం

మాలకొండ .

     


మాలకొండ క్షేత్రం మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉంది.ఇక్కడ స్వామివారిని శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసిమ్హస్వామి అని పిలుస్తారు.కందుకూరు నుంచి 30 కి.మి దూరంలో మాలకొండ ఉంది.చుట్టూరా దట్టమైన అడవి ఉండగా మద్యలో చిన్న కొండపై దేవాలయం ఉంది.మాలకొండ చేరాలంటే దగ్గరలో ఉన్న సింగరాయకొండ రైల్వే స్టేషన్లో దిగి బస్సులో కందుకూరు చేరవచ్చు.అక్కడినుంచి పామూరు వెళ్ళే బస్సు ఎక్కి మాలకొండ దగ్గర దిగాలి.


స్థలపురాణం: ఒకనాడు వైకుంఠంలో శ్రీమహా విష్ణువు శేషపానుపుపై పవళించి ఉండగా మహాలక్ష్మీదేవి స్వామి పాదాలు వత్తుతూ వున్నపుడు స్వామి ఇలా అడిగారట "లక్ష్మీ! నువ్వు ఈ లోకానికంతటికీ జగజ్జననివి,నీకు ఏదైనా కోరికవుంటే చెప్పు తప్పక నెరువేరుస్తాను" అన్నాడట..దానికి లక్ష్మీదేవి బదులిస్తూ "నాథా! సాక్షాత్తూ శ్రీమణ్ణారాయణున్నే భర్తగా పొందిన నాకు ఇంకేం కోరిక వుంటుంది,ఐనా మీరింతగా అడుగుతున్నారు కనుక ఒక వరం అడుగుతాను ప్రజలందరికీ మొక్షం పొందే మార్గం తెలియక నానా అవస్థలు పడుతున్నారు.

                                  ఈ పందిళ్ళలో భక్తులు స్వామివారికోసం పొంగళ్ళు వండుతారు.

కేవలం మీ నామాన్ని స్మరించినంత మాత్రంచేతనే సర్వజీవులకు మోక్షం లబిస్తుందందని తెలియక  సంసార భ్రాంతిలో కొట్టుమిట్టాడుతున్నారు,కనుక దర్శించగానే నీనామాన్ని స్మరిస్తూ జీవులందరూ తరించేలా ఒక క్షేత్రన్ని సౄష్టించండి" అని అడిగిందట!వెంటనే మహావిష్ణువు తన భక్తురాలైన వనమాలాదేవికి ముక్తినొసగి మాల్యాద్రిగా మార్చి లక్ష్మీ సమేతుడై శ్రీ జ్వాలా నరసిమ్హస్వామిగా అవతరించారు.ఈ దేవాలయం  వారానికి ఒక్కసారి శనివారం మాత్రమే తీయబడుతుంది.దీనికో పురాణగాథ వుంది.బ్రహ్మ నిత్యం ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటాడట! 

                                          నా మేనకోడలు,అల్లుడూ తలనీలాలు సమర్పిస్తుండగా..

ఒకసారి భాణమాణుడు అనే రాజు మాలకొండను దర్శించుటకు వెళ్ళాడట,అప్పుడే బ్రహ్మ పూజ ముగుంచుకుని వెళ్ళిపొయాడట.ఫూజ చేసేందుకు ఎవరూ లేకపొవటంతొ భాణమాణుడు ఆ శుక్రవారం రోజంతా ఉపవాసం ఉన్నాడట.మరునాడు బ్రహ్మ దేవుడు రాగానే స్వామి బ్రహ్మతో "ఈ భాణమాణుడు పూజ చేసేందుకు ఎవరులేక పాపం నిన్నంతా ఉపవాసం ఉన్నాడు,కనుక వెంటనే ఒక అర్చకుడిని నియమించి శనివారం మాత్రం మానవులకు నా దర్శనభాగ్యం కలిగించు మిగిలిన రొజుల్లొ మహర్షులంతా సేవించుకోవచ్చు" అని ఆజ్ణ ఇచ్చారట.


బ్రహ్మ దేవుడు నరసిమ్హశర్మ అనే ఒక అర్చకుడిని నియమించగా భాణమాణుడు అతని సాయంతో పూజాదికాలు ముగించుకుని దన్యుడయ్యాడు.  దేవస్థానంలోకి కెమారాలు అనుమతించరు,ఐతే నేను చాలాసార్లు చాలా దగ్గరగా దర్శించటం వల్ల నెట్ సాయంతో స్వామివారి విగ్రహాన్ని డిజైన్ చేసాను.


మా అన్నయ్య శేషాచార్యులు ఈ దేవాలయంలో పూజారిగ ఉన్నాడు అందువల్ల అంత దగ్గరగా చూడగలిగాను.తరువాత మేము స్వామివారి ప్రసాదాలు కొన్నాము.


పైన కనిపించే దారి కొండపైవున్న కళ్యాణ లక్ష్మీ నరసిమ్హస్వామి గుడికి వెళ్ళే మార్గం.ఇదిచాలా ఇరుకుగావున్నప్పటికీ ఎంతలావుగా వున్నవాళ్ళైనా సునాయాసంగా వెళ్ళగలరు.మద్యాహ్నం మా అన్నయ్యతో కలసి ఆలయంలోనే బొజనం చేసి దారిలోని గుహలు,గుహాలయాలు చూస్తూ కొండ దిగాము.

                                                          శ్రీ కళ్యాణ లక్ష్మీనరసిమ్హస్వామిపై ఫొటోలో మా భావగారు రవిప్రసాదాచార్యులు ఒక గుహలో వున్న శివాలయానికి వెలుతున్నప్పుడు తీసిన ఫొటో.ఆ శివాలయాన్ని క్రింది ఫొటోలో చూడొచ్చు.అక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని కిందికొచ్చి కందుకూరు పొయే దారిలో వలేటివారి పాలెంలో వున్న శ్రీ వీరాంజనేయస్వామిని దర్శించుకున్నాము.                                                    వలేటివారిపాలెం వీరంజనేయస్వామి 

మొత్తనికి మా యాత్ర చాలా ఆనందంగా జరిగింది.పామూరు రూటులోనే మాలకొండతోపాటుగా దగ్గరలో భైరవకోన వుంది.భైరవకోన యాత్ర కోసం పైన పోస్టులలో చూడండి.   

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి