5, ఆగస్టు 2012, ఆదివారం

రామేశ్వరం.


రామేశ్వరం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో వుంది.ఇది బంగాళాఖాతంలో వున్న ఒక దీవి.మన పురాణాలలో కాశీ తర్వాత అంతటి  ప్రాశశ్త్యం కలిగివుండటమే కాక దక్షిణకాశీగా పిలువబడుతుంది.రామేశ్వరం మన్నార్ సిందూశాఖలో వుంది.త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వానరసేనతో కలసి లంకకి వారథి నిర్మించింది(ధనుష్కోటి)ఇక్కడినుంచే.



రావణ సమ్హారం అనంతరం శ్రీరాముడు మహర్షుల సలహాపై బ్రహ్మహత్యా దోషనివారణార్థం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి ప్రత్యేకపూజలు నిర్వహించాలని ఆంజనేయుని కైలాసపర్వతానికి వెళ్ళి శివలింగాన్ని తెమ్మని ఆజ్ణాపించాడట.కానీ ఆంజనేయుడు ముహూర్త సమయానికి రాకపొవటంతో సీతాదేవి ఇసుకతో ఒక సైకతలింగాన్ని తయారుచేసిందట.



మరికొద్దిసేపటికే ఆంజనేయుడు శివలింగంతో తిరిగిరాగా,రఘురాముడు ఆంజనేయుడు నొచ్చుకోకుండా ఆ లింగాన్నికూడా సైకతలింగం ప్రక్కనే ష్టించాడట.ఆంజనేయుడు తెచ్చిన లింగాన్ని "విశ్వలింగం" అంటారు.పూజాకార్యక్రమాలు ముందుగా విశ్వలింగానికే నిర్వహించేలా శ్రీరాముడు ఆదేశించాడట.


రామునిచే ప్రతిష్టించబడటంవల్ల స్వామివారిని (సైకతలింగం)శ్రీ రామనాథస్వామిగానూ ఈ క్షేత్రం "రామేశ్వరం"గానూ పిలువబడుతుంది.రామేశ్వరం దర్శిస్తేనే కాశీయాత్ర సంపూర్ణమైనట్లుగా భావిస్తారు.



ఈ ఆలయంలోని శ్రీ రామనాథస్వామిలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటి.రామేశ్వరం దేవాలయ ప్రాకారం వైశాల్యరీత్యా ప్రపంచ ప్రశిద్దిగాంచింది.3.6 మీ. పొడవైన శిలాస్థంభాలపై అద్భుతరీతిలో చెక్కిన శిల్ప సంపద వీక్షకుల్ని అబ్భురపరుస్తుంది.




ఇక్కడికి కొద్దిదూరంలో శ్రీరాముడు పూజ నిర్వహించిన అగ్నితీర్థం వుంది.దగ్గరలోనే దర్శించతగ్గ మరో ప్రదేశం గందమాదన పర్వతం.ఇది రామేశ్వరానికి 2 కి.మీ. దూరంలో వుంది.



పురాణాల ప్రకారం హనుమంతుడు ఇప్పటికీ చిరంజీవిగా వుండి ఈ ప్రాంతంలోనే రామనామద్యానంలో వున్నాడని ప్రతీతి.తరువాత చెప్పుకోదగిన ప్రదేశం దనుష్కోటి.ఇది రామేశ్వరానికి 8 కి.మీ. దూరంలో వుంది.ఇక్కడినుంచే రామదండు లంకానగరానికి వారథి నిర్మించింది.


రామనామం వ్రాయబడి నీటిపై తేలాడే రాళ్ళను మనం ఇక్కడ చూడొచ్చు.రామేశ్వరం గొప్ప పుణ్యక్షేత్రమే కాక ప్రకృతి ప్రియులకు స్వర్గదామంలాంటిది.ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆశ్వాదించటానికి కేవలం భారతీయులేకాక విదేశీయులుకూడా వస్తుంటారు.   

రామేశ్వరం నుంచి శ్రీలంకకి నిర్మించిన వారధి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి