4, ఆగస్టు 2012, శనివారం

కన్యాకుమారి.



కన్యాకుమారినే "కన్నియాకుమారి" అని స్థానికంగా పిలుస్తారు.కన్యాకుమారికి ఒకవైపు తిరునల్వేళి జిల్లా,ఒకవైపు  కేరళ రాష్ట్రం,మరొకవైపు బంగళఖాతం,అరేబియా,హిందూ సముద్రాల కలసిన త్రివేనీ సంగమం హద్దులుగా ఉన్నాయి.కన్యాకుమారి భారతదేశ ప్రదాన భూభాగపు సరిహద్దు మాత్రమేకాక కన్నియాకుమారి జిల్లా ముఖ్యపట్టణం కూడా.స్థానిక ముఖ్య దేవతైన కన్యాకుమారి అమ్మవారి పేరుమీదుగా ఈ జిల్లాకి ఆ పేరు వచ్చింది.


                                    కన్యాకుమారి ఆలయం
నేను ప్రతీ యేడాది అయ్యప్ప మాల వేసుకుంటాను,యాత్రలలో భాగంగా ప్రతీసారి కన్యాకుమారిని దర్శిస్తూవుంటాను.అంతేకాదు 2004లో సునామీ వచ్చినప్పుడుకూడా నేను అక్కడే ఉన్నాను.పోలీసుల అప్రమత్తతవల్ల మేము తప్పించుకొని రాగలిగాము.అసలు విషయానికి వద్దాం.




స్థలపురాణం ప్రకారం పార్వతీదేవి అంశ అయిన కన్యాకుమారి ఒకానొకప్పుడు ఈ ప్రదేశంలోని ఒక రాతిపై పరమశివునికై ఘోర తపస్సు చేసి శివునిలో ఐక్యమయ్యిందట.తాను పెళ్ళికాని కన్య కనుక కన్యాకుమారిగా పిలువబడింది.పూర్వం ఈ ప్రాంతం ట్రావెంకోర్ ధాన్యాగారంగా పిలువబడేది.




చాలకాలంపాటు ట్రవెంకోర్లో భాగంగా వుండి 1956లో భాషా ప్రయుక్తరాష్టాల పునర్విభజనలో తమిళనాడులో కలసింది.కన్యాకుమారి బీచ్ చాలా అందంగా వుంటుంది.ఐతే బీచ్లో చాలా రాళ్ళు,చిన్న చిన్న కొండలు వుండటంవల్ల సముద్ర ఉద్రుథి ఎక్కువగా వుండి బలంగా మనుషుల్ని కూడా రాళ్ళపై విసిరేసేలా వుండటంతో ప్రజల్ని హెచ్చరించటానికి ఇక్కడ పోలీసుల నిఘాకూడా వుంటుంది.


                                  వివేకానంద మెమోరియల్
ఇక్కడి ఆలయంలో కన్యాకుమారిదేవికి నిత్యం విశేష పూజలు జరుగుతుంటాయి.ఆలయానికి సమీపంలోనే గాందీమండపం వుంది.ఇక్కడే మహాత్ముని చితాభస్మాని త్రివేనీ సంగమంలో కలపటానికి ముందుగా ప్రజల దర్శనార్దం వుంచటం జరిగింది.ఈ మండపాన్ని ఒరియాశైలిలో నిర్మించారు.


                                           గాంధీ మండపం
1892 డిసెంబర్ 25న స్వామి వివేకానంద ఇక్కడికి వచ్చి ఒక రాతిపై రాత్రంతా ద్యానంలో నిమగ్నమై భారతీయ హిందూ వేదాంతాన్ని దేశదేశాలలో వ్యాపింపచేయాలని నిశ్చయించుకున్నారట.ఆ మరుసటి యేడాదే ఆయన ప్రపంచ మతసభలకు హాజరవ్వటం జరిగింది.


                                     తిరువెళ్ళువార్ విగ్రహం
దీనికి గుర్తుగా ఆ రాయివున్న ప్రదేశంలో వివేకానందా మెమోరియల్ని నిర్మించటం జరిగింది.దాని ప్రక్కనే గొప్ప తమిళ కవి.రుషి పుంగవుడు అయిన 133 అడుగుల శ్రీ తిరువెళ్ళువార్ విగ్రహం వుంది.కన్యాకుమారిలో చెప్పుకో తగినది సూర్యోదయ,సూర్యాస్తమయ సమయాలలో సూర్యకిరణాలు సముద్రంపై పడినప్పుడు ఆ దౄశ్యం చాలా అద్భుతంగా వుంటుంది. 




కన్యాకుమారి వచ్చిన యాత్రీకులను ఇక్కడ అమితంగా ఆకర్షించేది షాపింగ్.రకరకాల గవ్వలూ,పూసలు ఇక్కడి ప్రత్యేకం.వీటితోపాటు ప్రతీ వస్తువూ ఇక్కడ దొరుకుతుంది.




ఏ వస్తువైనా 5రూ.,10రూ.సాంప్రదాయం ఇక్కడే ప్రారంభమయ్యింది.ఇక్కడికి వచ్చినవళ్ళు గుడికెళ్ళటమైనా మానేస్తారేమొకానీ షాపింగ్ మాత్రం తప్పక చేస్తారు.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి