6, ఆగస్టు 2012, సోమవారం

శబరిమల అయ్యప్ప.





ఋగ్వేదంలో ప్రజ్ణానం బ్రహ్మ,యజుర్వేదంలో తత్వమసి,సామవేదంలో అహం బ్రహ్మాస్మి,అదర్వణవేదంలో అయం ఆత్మా బ్రహ్మ.ఈ సృష్టిలోని సకల చరాచర జీవరాశులన్నింటిలోనూ అంతర్లీనంగావున్న ఈశ్వర చైతన్యాన్ని గుర్తించమని చెప్పటమే వీటిలోని సారాంశమంతా.మాలవేసుకున్న భక్తునికీ,భగవంతునికీ మద్య వున్న సంబందాన్ని తేటతెల్లం చేస్తూ శబరిమల దేవస్తాన సన్నిదానంపై "తత్వమసి" అన్న పదాలు దర్శనమిస్తాయి.




తత్=అది,త్వం=నేనై,అసి=వున్నను.అంటే ఈశ్వర చైతన్యం ఏదైతే వుందో అది నేనై వున్నాను అని అర్దం.శబరిమలలో అయ్యప్ప చిన్ముద్రతో దర్శనమిస్తుంటాడు.చివరి మూడు వ్రేళ్ళు త్రిగుణాలకు గుర్తు.బ్రొటన వ్రేలు,చూపుడు వ్రేలూ ఆత్మా,పరమాత్మలకు గుర్తులు.అంటే త్రిగుణాలను త్యజించి ఆత్మను పరమాత్మలో లీనం చేయటంద్వరా భక్తుడు భగవంతుడవుతాడు.దేవతల భూమిగా పిలచే కేరళ రాష్టంలోని పత్తినంతిట్ట జిల్లాలోని సహ్యాద్రి పర్వత సానువులలో పంచగిరులపై వెలసిన పంచగిరీశుడే అయ్యప్ప.స్కందపురాణంలోనూ,కంభ రామాయణంలోనూ అయ్యప్ప జన్మవృత్తాంతం కనిపిస్తుంది.అయ్యప్ప జన్మ గూర్చి భక్తులకు వున్న కొద్దిపాటి సందేహాలనూ నివ్రుత్తి చేయాలన్నదే నా తపన.




మహిషి,మహిషాసురుల వృత్తాంతం:పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు చేయగా,బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏవరం కావాలో కోరుకోమని అడిగాడట.దానికి మహిషాసురుడు తనకు మరణం లేకుండా వరం ఇమ్మని అడుగగా దానికి ప్రజాపతి అలాంటివరం ఈవ్వటం కుదరదని మరో వరం కోరుకోమని చెప్పాడట.ఐతే తన రక్తపు బొట్టు నేలపై పడినప్పుడళ్ళా ఒక తనలాంటి మహిషాసురుడు పుట్టేలా వరం పొందాడు మహిషాసురుడు.ఆ వరంతో పొంగిపోయిన ఆ అసురుడు దేవతలనూ,ప్రజలనూ భాదించటం మొదలెట్టాడు.దేవతలంతా కలసి ఆ జగజ్జనని ప్రార్దించగా ఆ మహశక్తి ఆ అసురినితో యుద్దానికి దిగింది.




అతన్ని పొడిచిన ప్రతీసారీ క్రిందపడిన ఒక్కో రక్తపు బొట్టునుంచి ఒక్కో రాక్షసుడూ పుడుతూ వున్నాడట.అలా ఆ మహిషాసురుడు ఎంతకూ చావక పోవటంతో ఆగ్రహించిన ఆ శక్తి స్వరూపిణి మహాకాళిగా మారి తన నాలుకని ఆ రణరంగమంతా పరచి ఆ అసురిని రక్తాన్ని క్రిందపడకుండా తన నాలుకపై పడేలా చేసి ఆ మహిషాసురుని హతమార్చింది.మహిషి పూర్వ జన్మలో దత్తాత్రేయుని బార్య లీలావతి.దత్తాత్రేయుడు ఒకసారి తను వానప్రస్తానానికి(అనగా తపస్సు ఆచరించేందుకు)వెళుతున్నానని చెప్పగా,లీలావతి తనకు కామవాంచ ఇక నశించలేదనీ కనుక వానప్రస్తాన్ని వాయిదావేయమని అడుగుతుంది.ఎంతచెప్పినా వినకుండా కామోన్మాదంతో వున్న లీలావతిని మహిషివైపొమ్మని శపిస్తాడు దత్తాత్రేయుడు.ఆ శాపం కారణంగా మరుసటి జన్మలో మహిషాసురుని సోదరి అయిన మహిషిగా జన్మిస్తుంది.  



మహిషాసురిని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అతని సోదరి అయిన మహిషి బ్రహ్మదేవునిగూర్చి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై ఏవరం కావాలో అడుగగా మహిషి తన అన్నలాగే మరణం లేకుండా వరం అడిగిందట.దానికి బ్రహ్మ పుట్టిన ప్రతీజీవి గిట్టక తప్పదనీ,కనుక మరేదైనా వరం కోరుకోమని అడిగాడట.అయితే తనకు హరిహరుల పుత్రునివల్ల మరణం కలిగేలా వరం ఇమ్మని అడిగిందట.బ్రహ్మ ఆమెకు ఆ వరాన్ని ప్రసాదించి అదృశ్యమవగా హరిహరులకు పుత్రుడు కలగటం అసంభవం కనుక ఇక తనకు చావు లేదని మహిషి నిశ్చయించుకుని,ఇక తన అన్న చావుకి కారణమైన దేవతలపై పగ తీర్చుకోవాలని దేవతలనూ,మునులనూ,ప్రజలనూ హింసించటం మొదలుపెట్టింది.



రామునికి శ్రీ మహవిష్ణువుకీ సంభందం వుందని అందరికీ తెలుసు.ఐతే శక్తిశాలి ఐన హనుమంతునికీ పరమ శివునికీ సంభందం వున్నదని చాలా మందికి తెలియదు.పూర్వం ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువికీ, పరమ శివునికీ మద్య ఒక వాదన జరిగిందట.పురుషులను సైతం ఆకర్షించే అందం నారాయణుని సొంతం (ఈ విషయం రామాయణంలో పట్టాభిషేక ఘట్టంలోనూ కనిపిస్తుంది).అలాంటి నారయణుడు ఇక స్త్రీ రూపం దరిస్తే ఇంకేమైనా వుందా,సాక్షాత్తు పరమ శివునికైనా మనస్సు చలించాల్సిందే.ఈ విషయమై ఇదారి మద్యా వాదోపవాదాలు జరిగాక,తాను కనుక చలించినట్లైతే విష్ణువుకు దాస్యం చేస్తానని పరమ శివుడు అన్నాట్ట.ఆ తర్వాత భస్మసురిని సంహార సమయంలోనూ,క్షీరసాగర మదన సమయంలోనూ విష్ణువు మోహిని రూప దరుడైన విషయం మనకు తెలిసిందే.




ఆ సమయంలోనే శివుడు మోహినిని చూచి చలించగా రేతస్సు పతనమైనదట!ఆ రేతస్సునుంచి ఉద్భవించిన వాడే శ్రీ దర్మశాస్త.అంతేకానీ వారిద్దరిమద్య లైంగిక సంబందం వల్ల కాదు.అందులోనూ మహిషి తనకు శివ,కేశవులకు జన్మించిన వానివళ్ళనే మరణం రావాలని ప్రజాపతిని కోరింది కనుక,లోకకళ్యాణర్దం ఈ ఘట్టం జరుగుటలో శివ కేశవులు తమ భాద్యతలని నిర్వర్తించారు కానీ దీనిలో శివుని బలహీనత అంతకన్నా లేదు.ఐతే ఇచ్చిన మాట ప్రకారం శివుడు ఆంజనేయునిగా త్రెతాయుగంలో శ్రీరామునికి సేవ చేసాడు.మన పురాణాలలో రేతస్సును కుండలో వుంచటంవల్ల ఉద్భవించిన కుంభసంభవుల గాథలు మనకు అనేకం కనిపిస్తాయి.మహా పురుషులంతా కుంభం నుంచి ఉద్భవిస్తారు అన్నదానికి గుర్తుగా మన పూజా కార్యక్రమాలలో దేవతలను కుంభం లేదా కలశంలోనికి ఆవాహన చేస్తుంటారు.మన రాష్ట్ర చిహ్నం కూడా పూర్ణ కుంభమే!అయ్యప్ప జన్మించాక వారు వెంటనే ఆయన్ని పంపా తీరంలో వదలివేయలేదు.ఆ బిడ్డకు శ్రీ దర్మశాస్తా అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.వినాయకునికి విఘ్నాదిపత్యం,స్కందునికి దెవసేనాదిపత్యం ఇచ్చినట్లు దర్మశాస్తాను భూథగణాలకు అదిపతిగా నియమించారు.




అందుకనే అయ్యప్పను భూతగణనాథుడు అనికూడా పిలుస్తారు.యుక్త వయస్సు వచ్చాక అయ్యప్పకు శ్రీ పూర్ణా దేవిని,పుష్కళాదేవితో వివాహం జరిపించారు.తదుపరి దేవతలంతా పరమ శివుని వద్దకు వచ్చి ధర్మశాస్తా అవతారానికి మూలమైన మహిషి సంహార కార్యాన్ని గుర్తు చేయగా అయ్యప్పని తిరిగి ఒక మానవ భాలునిగా మార్చి పావన పంభాతీరంలో వదిలి వెళ్ళటం జరిగింది(ధర్మశాస్తా విజయునికి ఇచ్చిన వరాన్ని సద్వినియోగం చేసుకొనే సరైన సమయమిదేనని భావించటం జరిగింది).విజయుని వృత్తాంతం:పూర్వ జన్మలో బ్రహ్మణుడైన విజయుడు సంతానం లేక ఎందరో ఋషులనూ,మునులనూ తనకు సంతానం కలిగేలా ఆశీర్వదించమని ప్రార్దిస్తూ చివరికి శబరి వద్దకు వెళ్ళాడట.శబరి అతనికి ఒక కుండ ఇచ్చి తన ఆశ్రమానికి ఉత్తరంగా వున్న కాలువనుంచి నీటిని తెమ్మని చెప్పిందట.విజయుడు కాలువ వద్దకు వెళ్ళి కుండలో నీళ్ళు ముంచుకుని తలపై పెట్టుకుని తిరిగి వస్తుండగా అది పొరపాటున జారి క్రింద పడిందట.




ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో వున్న విజయునికి ఎదురుగా ఒక భాలుడు కనిపించి ఏమికావాలని అడిగాడట.ఆ భాలుడి రూపాన్ని చూసి తన్మయత్వం చెందిన విజయుడు నువ్వు నా కుమారిడిగా ఉండాలని కోరాడట.దానికి భాలుని రూపంలో ఉన్న దర్మశాస్తా తథాస్తు అన్నాడట.ఆ విజయుడే తరువాతి జన్మలో పందల చక్రవర్తి ఐన రాజశేఖరునిగా పుట్టి,సంతనం లేక ఎన్నొ పూజలూ,నోములూ చేసాడు.ఒకసారి వేటకు వచ్చిన రాజశేఖరునికి,ఇచ్చిన మాట ప్రకారం దర్మశాస్తా పసిభాలునిగా పంబా తీరంలో మనికంటునిగా దర్శనమిచ్చాడు.సంతానంలేని తనకు భగవంత్ని వరప్రసాదంగా భావించిన పందళాదిపతి ఆ భాలుడిని తన రాజ్యానికి తీసుకునిపోయి తన రాణికి అప్పగించాడు.కంఠమునందు మణితో శివ,కేశవ తేజస్సుతో ఉట్టిపడుతున్న ఆ భాలునికి మణికంఠుడు అని పేరు పెట్ట్కూని కంటికి రెప్పలా పెంచారు రాజదంపతులు.




కొద్ది కాలానికే స్వామి దయ వల్ల వారికి ఒక మగబిడ్డ జన్మించాడు.(బహుశా తానొక్కడే ఐతే తనను వాళ్ళు వదులుకోలేరని స్వామి భావించాడేమో).రాజశేఖరుడు మనికంఠుడిని విధ్యాభ్యాసానికై గురుకులానికి పంపాడు.అక్కడ అస్త,శస్త్ర విద్యలతో పాటు సకల విద్యా పరంగతుడైన మనికంటుడు,గురుకులాన్ని వదిలి వెళ్ళే ముందు తన గురువుకు నమస్కరించి గురుదక్షిణగ ఏమివ్వలో చెప్పమని ప్రార్దించగా,గురువు కళ్ళనీళ్ళ పర్యంతమయ్యడట.మనికంఠుడు ఆయ్యన్ని ఊదర్చి,తమ భాదను తనతో పంచుకోవలసిందిగా అడుగగా,ఆయన తన కుమారుడిని చూపించి వీడు నాకు ఒక్కగానొక్క కొడుకు.పుట్టు చెవిటి,మూగ.నా దిగులంతా వాడిని గూర్చే అని చెప్పాడట.కరుణాసముద్రుడైన మనికంఠుడు తన గురువు భాదని చూసి తట్టుకోలేక ఆ భాలుడిని పిలచి తన కరములతో అతని కళ్ళను స్పర్శి,నాలికపై భీజాక్షరాలని వ్రాయగా అతనికి దృష్టి,వాక్కు రెండూ వచ్చాయట.




మణికంఠుడు దైవాంశ సంభూతుడని తెలియచెప్పిన మొదటి సంఘటన ఇది.రాజ్యానికి తిరిగి వచ్చాక మణికంఠునికి పట్టాభిషేకం చెయ్యలని తల్లిదండ్రులు నిశ్చయించారు.(తన తల్లికి ఇష్టంలేక అడవికి పంపినది అన్నది నిజం కాదు).దేవతల రాజైన ఇంద్రుడు మహిషిని సంహరించె సరయిన సమయం ఇదే అని భావించి,రాణికి శిరోవేదన వచ్చేలా చేస్తాడు,అంతేకాక తానే ఆస్తాన వైద్యుడి రూపంలో వచ్చి ఆ వ్యాదికి పులిపాలు మాత్రమే తగిన ఔషదమని చెప్తాడు. 




తల్లి భాదని చూసి తట్టుకోలేకపొయిన మణికంఠుడు తల్లిదండ్రులు వద్దని చెప్పిన వినకుండా పులిపాల కోసం బయలుదేరుతాడు.అయ్యప్పని తనని సంహరించటానికే దేవతలు అడవికి పంపారని తెలిసిన మహిషి ప్రతీకార జ్వాలతో మణికంఠునికి ఎదురవుతుంది.



అదే సమయంలో అక్కడికి వచ్చిన దేవేంద్రుడు మణికంఠునికి తన జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తాడు.తన కర్తవ్యాన్ని గ్రహించిన మణికంఠుడు మహిషిని సంహరిస్తాడు.దేవేంద్రుడు,ఇతర దేవతలూ పులులుగా మారి మణికంఠుని పందళరాజ్యానికి చేరుస్తారు.




పులి వాహనుడై వస్తున్న మణికంఠుడిని చూసి రాజ దంపతులే కాక పందళ ప్రజలంతా ఆశ్చర్య పొతారు.స్వామి శక్తిని తెలియజెప్పిన మరో ఘటన ఇది.రాజదంపతులు మణికంఠునికి పట్టాభిషేకం చేయాలని మరోసారి నిర్నయించుకోగా,మణికంఠుడు తాను సన్యసించాలని నిర్నయించుకున్నట్లు చెప్తాడు,తాను భాణాన్ని సందించి వదులుతానని అది పడిన ప్రదేశంలో తనకు ఒక ఆలయం నిర్మించమని తన తండ్రితో చెప్తాడు.




అలా మొదట భాణం పడిన ప్రదేశం సారంకుత్తి అనీ,రెండో భాణం పడిన ప్రదేశంలో సన్నిదానాన్ని నిర్మించటం జరిగింది.ఐతే అయ్యప్ప తన అవతారానికి మూలమైన మహిషి సంహారం తర్వాత హాయిగా తిరిగి కైలాసానికి వెళ్ళి చక్రవర్తిలా వుండక శబరిమలలో ఆలయం నిర్మించమని పందళ రాజుకి చెప్పి,ఎందుకు అక్కడే ధ్యాననిమగ్నుడై వుండిపొయినట్లు?




ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి.అయ్యప్ప ఒకసారి అడవిలో వెలుతుండగా రామనామాంకిత ధ్యానంలో వున్న హనుమంతుడు కనిపిస్తాడు.సాక్షాత్తు శ్రీరాముడే అయిన అయ్యప్పను చూసి హనుమంతుడు పులకరించిపోతాడు(అంటే తాను శీవ,కేశవ అంశ కనుక, శివాయ విష్ణు రూపాయ,శివ రూపాయ విష్ణవే అని పద్మపురాణం చెప్తుంది).




కలియుగంలో ప్రజలు పాప భీతి లేకుండా వున్నారనీ,నైతిక విలువలకు తిలోదకాలిచ్చి ఉత్తమమైన మానవ జన్మ పరమార్దం గ్రహించక పాపకూపంలో చిక్కుకుంటున్నరని బాదపడతాడు హనుమ.ప్రజలను భక్తి మార్గంవైపు మళ్ళించి తాను గీతలో చెప్పిన కర్మ సిద్దాంతాన్ని ఆచరించేలా చేస్తానని హనుమకు మాటిచ్చాడు మణికంఠుడు.



అంతేకాక ప్రజలను పట్టి పీడిస్తున్న శనీశ్వరుని తన భక్తుల జోలికి రాకుండా వుండాలని స్వామి ఆజ్ణాపించాడు.అందుకోసం శనికి ప్రీతి కలగచేయుటకై తన దీక్షను తీసుకున్న భక్తులు శనికి ఇష్టమైన నల్లని బట్టలే దరిస్తారనీ,శనిపెట్టే భాదలన్నిటినీ మండలకాల దీక్షలో నియమాల రూపంలో సంతోషంగా ఆచరిస్తారనీ శనేశ్వరునికి మాటిచ్చాడు.




మనం సరిగ్గా గమనించినట్లైతే గనుక ప్రతీ ఏడాది కొన్ని లక్షలమంది భక్తులు మాలాధారణ చేసి నలబై రోజులు (నిజానికిది 48 రోజులు.మండలము అనగా ఒక మాసము+ఒక పక్షము+మూడు దినములు=30+15+3=48 రోజులు)దీక్షలో వుండి అయ్యప్పని దర్శిస్తూ వున్నారు.సంవత్సరంలో కనీసం రెండు నెలలు వారిని భక్తులుగా,మంచి మార్గంలో వుంచేలా చేస్తున్నది ఈ మాలాదారణే.ఈ సమయంలో క్రైమెరేటు కూడా చాలా తగ్గిపోతుంది అంటే దాని ప్రభావాన్ని అర్దం చేసుకోవచ్చు.మనకోసమే ఆ శభరీశుడు బ్రహ్మచారిగా ఆ శభరిగిరిపై శాశ్వతంగా ధ్యాననిమగ్నుడయ్యాడు.




మకరజ్యోతి గురించి వాస్తవాలు: మణికంఠుడు తాను ప్రతీ యేడాది మకర సంక్రాంతి రోజున కాంతమలపై జ్యోతి రూపంలో కనిపిస్తానని ఆ సమయంలో తనకు ఆభరణాలు అలంకరించుకొని తమ కోరిక తీర్చుకోమని తన తండ్రితో చెప్పాడు.అన్నమాట ప్రకారం ఇప్పటికీ ఆ కాంతమలపై మకర సంక్రాంతి రోజున జ్యోతిరూపంలో దర్శనమిస్తుంటాడు.ఆ దివ్య జ్యోతి పూర్తి వైరాగ్యంతో,సకల జీవుల ఎడల సమదృష్టిని కలిగి ఎవ్వరినీ నొప్పించక ఆ శభరీశుడే సర్వస్వంగా భావించే మహభక్తులకు మాత్రమే దర్శనమిస్తుంది.కానీ అల్లంటి భక్తులు ఎంతమంది వున్నారు?అదిక సంఖ్యలో వున్న సధారణ భక్తులకు ఆ దివ్య జ్యోతి కనిపించె అవకాశమే లేదు.ఐతె ఇది చివరికి అసలు జ్యొతే లేదనే స్తితికి దిగజారవచ్చనే వుద్దేశ్యంతో మకర విళక్కు(దేవాలయం వారే జ్యోతిని వెలిగించటం)అనే సాంప్రదాయాన్ని ప్రారంభిచ్టం జరిగింది.ఈ విషయం ఎన్నో సంవత్సరాలానుండి శబరికి వస్తున్న గురుస్వాములందరికీ తెలిసిందే.ఈ విషయాన్ని తెలుసుకోలేక కొందరు ఆ దివ్య జ్యోతినే అనుమానించటం ఇటీవల జరుగుతున్నది.




ఈ విషయాన్ని భక్తులకు అర్దమయ్యేలా ముందే చెప్పక పోవటం,పైగా కనిపించేదే నిజమైన జ్యోతని నమ్మించటానికి ప్రయత్నించటం ట్రావెంకోర్ దేవస్వం బోర్డు చేసిన పెద్ద తప్పిదం అని నా అభిప్రాయం.నేను గత 14 సంవత్సరాలుగా శబరిమల వెళ్ళివస్తున్నాను.కానీ నాకు చిన్నతనం నుంచే అయ్యప్ప పట్ల అమిత భక్తి ఏర్పడింది.నా జీవితంలో జరిగిన అనుభవాలు అయ్యప్ప వునికిని నాకు తెలిసేల చేసాయి.ఎవరికైనా శబరిమల యాత్ర గూర్చి తెలుసుకోవాలని వుంటె పైన వున్న ఆర్చివ్ లో శబరిమల యాత్ర అన్న పొస్ట్ చదవండి.మీ అభిప్రాయాలని క్రింద కామెంట్స్ లో తెలియజేయండి.స్వామి శరణం.          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి