5, ఆగస్టు 2012, ఆదివారం

మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి.



మేము మా శబరిమల యాత్రలో భాగంగా ఒకసారి మేల్మరువత్తూర్ వెళ్ళటం తటస్థించింది.ఇక్కడి ఆదిపరాశక్తి గుడి చాలా ప్రసిద్దిగాంచింది.ఒక్కసారి దర్శిస్తే ఎప్పటికీ మరచిపోలేని ముగ్దమనోహర రూపం అమ్మవారిది.భగవంతుని ముందు అందరూ సమానమనే విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా పాటిస్తారు.దానినే తమిళ భాషలో "ఒన్రె కులం,ఒరువనే దేవం" అని అంటారు.అంటే ఒకే కులం,ఒకే దైవం అని అర్దం. 


భక్తులెవరైనా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మని ప్రార్దించే మహత్తర అవకాశం ఈ ఆలయంలో వుంది.ఈ దేవాలయ స్థాపకులు శ్రీ బంగారు నాయకర్.అనేక సంస్థలు,సేవా ట్రస్తులు వీరి ఆద్వర్యంలో నడపబడుతున్నాయి.ఈ దేవలయం ఉన్నచోట దట్టమైన అటవీ ప్రాంతం వుంది.ఇక్కడే ఒక వేపచెట్టు వుండేదట.దానినుంచి కారే పాలు చాలా తియ్యగా వుండటమేకాక ఎన్నో వ్యాదులని నయంచేసే శక్తిని కలిగివుండేదట.


1966 లో వచ్చిన తుఫానులో ఈ మహావృక్షం కూలిపోగా అక్కడ ఒక స్వయంభు లింగం  బయల్పడింది.అది సాక్షాత్తు ఆదిపరాశక్తిచేత పూజలందుకునే లింగంగా భావించిన భక్తులు ఆ లింగాన్ని అమ్మవారి ముందు ప్రతిష్టించారు.ఇక్కడి ఆదిపరాశక్తి ధృవమూర్తి పద్మం మద్యలో ఆసీనురాలై దర్శనమిస్తుంది.



ఈ ఆలయంలో చెప్పుకో దగినది పుదుమండపం.ఈ మండపంలోనే ఆదిశక్తి నాగదేవత రూపంలో తపస్సు చేసిందట.దీనికి గుర్తుగా ఈమండపాన్ని నిర్మించటం జరిగింది.దీనినే సర్పకన్యా మండపం అనికూడా అంటారు.ఇక్కడికి దగ్గరలోనే అథర్వణ భద్రకాళీ ఆలయం వుంది.ఇక్కడ భక్తులతోపాటు ఆలయ సిబ్బంది ఎర్రని వస్త్రాలు దరిస్తారు.



ఏ కులమైన,ఏ మతమైనా అందరూ సమానమే అందరి రక్తం వుండేది ఎరుపు రంగులోనే అన్నది ఇందులోని పరమార్దం.ఇక్కడ అమ్మవారి మాలాధారణ చేసిన భక్తులు భక్తిశ్రద్దలతో ఇరుముడులు సమర్పిస్తుంటారు.


మేల్మరువత్తూర్లో నన్ను భాగా ఆకర్షించిన విషయం శుచీ,శుభ్రత.దేవాలయ ప్రాంగణమేకాక,ఇక్కడి రైల్వే స్టేషన్ కూడా ఎంతో శుభ్రంగా ఉంటుంది.నడిచేటప్పుడు నా కాలి అడుగులు  పడతాయేమో అని నేను భయపడ్డానంటే ఎంత శుభ్రంగా వుంటుందో ఊహించుకోవచ్చు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి